చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
గిరిజన ప్రాంత పేద పిల్లలకు పాదరక్షలు పంపిణీ
కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కాకుండా జాతీయస్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవికుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోని గట్టు మల్ల పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల నిరుపేద పిల్లలకు పాదరక్షలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ సభ్యులు సామాజిక సేవాకర్త రూప్ల నాయక్ మాట్లాడుతూ దేశస్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తనదైన శైలిలు ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెనిగళ్ళ రవికుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. గట్టు మల్ల పంచాయతీలో గుట్టలపై నివాసం ఉంటున్న చత్తీస్గడ్ వలస గుత్తి కోయిల పిల్లలకు సుమారు 300కు పైగా పాదరక్షలను అందించమని తెలిపారు. తన సంపాదనలో కొంత నిరుపేద వర్గాలకు వెచ్చించి అన్నివేళలా మానవత్వాన్ని చాటుకుంటున్న రవికుమార్ ఆయురారోగ్యాలతో దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



