కొలువుతీరునున్న వర్తక సంఘం కార్యవర్గం ఇదే
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలో వర్తక సంఘ ఎన్నికలు ఈ నెల 16న ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల్లో ఓటర్లు రెండు ప్యానల్ల అభ్యర్థులకు సమన్యాయం చేసినట్లైంది. దీనిలో భాగంగా సోమవారం త్వరలో కొలువు తీరనున్న సెంట్రల్ బాడీ సభ్యులు సమావేశం అయ్యారు. రానున్న కాలంలో వర్తక సంఘ పాలకవర్గం చేపట్టాల్సిన విధివిధానాలపై చర్చించడం జరిగింది. పాలకవర్గం తీసుకునే నిర్ణయాలపై ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అధ్యక్షులు కురువెళ్ల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి సోమా నరసింహారావు, ఉపాధ్యక్షులు బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శి బాదేరవి, ట్రెజరర్ తల్లాడ రమేష్, ఈసీ మెంబర్లు మాటేటి కిరణ్, రాయపూడి రవి,వంగవీటి హరీష్,పోట్ల రామనాధం, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.


