బిగ్ బ్రేకింగ్ న్యూస్..!
డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినేట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తానికి డిసెంబర్‌లో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, 50 శాతం మొత్తం రిజర్వేషన్ పరిమితికి లోబడి పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మొగ్గు చూపింది. నవంబర్ 24 లోపు ఎన్నికల షెడ్యూల్‌పై నిర్ణయం తెలపాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.


