జగిత్యాల జిల్లాలో ఎస్సైల బదిలీలు
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మపురి ఎస్సైగా పనిచేస్తున్న పి. ఉదయ్‌కుమార్‌ను వెల్గటూరు ఎస్సైగా నియమించారు. జగిత్యాల రూరల్ ఎస్సైగా ఉన్న ఎన్. సుధాకర్‌ను జగిత్యాల డిసిఆర్బి విభాగానికి బదిలీ చేశారు. వెల్గటూరు ఎస్సైగా పనిచేస్తున్న ఆర్. ఉమా సాగర్‌ను జగిత్యాల రూరల్ ఎస్సైగా నియమించారు. అదేవిధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న జి. మహేష్‌ను ధర్మపురి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.


