రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం
జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనం : సొసైటీ డైరెక్టర్ హీరోలాల్
కాకతీయ, కారేపల్లి : రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న రాష్ట్ర ప్రజానీకం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని కారేపల్లి సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరోలాల్ అన్నారు. ఇందుకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ విజయమే ఇందుకు నిదర్శనమని అన్నారు. శనివారం హీరాలాల్ విలేకరులతో మాట్లాడుతూ నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు పొందడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వంపైన ఎంతో నమ్మకం ఉందని ఆయన తెలిపారు. వైరా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. కారేపల్లి మండలానికి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేసే విషయంలో ఎమ్మెల్యే చేస్తున్న కృషి ఎంతో ఉందని తెలిపారు.


