మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి
జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్
కాకతీయ ,కొత్తగూడెం రూరల్: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది :భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల మండలంలోని ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బక్కచింతలపాడు,కిష్టారంపాడు,వీరాపురం,రాళ్ళపురం,తిమ్మిరిగూడెం,కమలాపురం గ్రామాల ప్రజలకు తిమ్మిరిగూడెంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఓఎస్డి నరేందర్,భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ సందర్శించారు. సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ రంజన్,చర్ల సీఐ రాజు వర్మ,ఎస్సైలు నర్సిరెడ్డి,కేశవ ఇతర పోలీస్ అధికారులు,సిబ్బందితో కలిసిఆరు మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లోని 250 కుటుంబాలతో సమావేశమయ్యారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ ఆరు గ్రామాల ప్రజలకు నెస్టెల్ కంపెనీ సహకారంతో నిత్యావసర వస్తువులను అందించారు.

ఈ సందర్భంగా ఓఎస్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సారథ్యంలో ఏజెన్సీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య,వైద్యం,రవాణా వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.ఇందులో భాగంగానే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అదీవాసీ ప్రజలు తమ ఆరోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.దోమల వలన డెంగీ,మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.అభివృద్ధి నిరోధకులైన నిషేదిత మావోయిస్టులకు ఎవ్వరూ సహకరించవద్దని కోరారు.ప్రత్యక్షంగానైనా,పరోక్షంగానైనా మావోయిస్టులకు సహకరిస్తే,అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడతాయని అన్నారు.మారుమూల ఏజెన్సీ ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడానికి ముందుకొచ్చిన నెస్టెల్ కంపెనీ కి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.



