మాలల రణభేరి మహాసభను విజయవంతం చేద్దాం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఈ నెల 23వ తేదీన హైదరాబాదులో గర్జించబోయే మాలల రణభేరిని విజయవంతం చేయాలన్న చిన్నయ్య గారి పిలుపు, ప్రతి మాల కుటుంబ హృదయంలో ఒక నూతన జ్యోతి వెలిగించింది. వర్గీకరణ కోసం, మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం—లక్షలాదిగా ఒకే గళంతో హాజరవ్వాలని శనివారం మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నూతన పిలుపునిచ్చారుచుంచుపల్లి మాల మహానాడు కార్యాలయంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం… కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది మన బాధల కథ, మన ఆశల పథం, మన గర్వపు గాథ. రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దెల శివకుమార్ , పీకే కృష్ణ , మహిళా రాష్ట్ర నాయకురాళ్లు బడిగల పుష్పలత, రత్నకుమారి, లావణ్య, మాధవి, జెరూసలేం పురుషోత్తం, కూరపాటి రవీందర్, అల్లి ప్రకాష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


