గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడం నా లక్ష్యం
ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న జగన్
కాకతీయ, జూలూరుపాడు: అధిక వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు అన్ని గుంతలు గుంతలు గా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవు పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బానోతు జగన్ గ్రామానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గుండ్లరేవు పంచాయతీ, రామ్ పురం తండా లో అకాల వర్షాల వల్ల పంచాయతీలోనీ అంతర్గత రహదాలు సీసీ రోడ్ లేకపోవడంతో రోడ్లు అన్ని గుంతలుగా ఏర్పడంతో ముసలివారు,మహిళలు,ఇంటి నుండి బయటకు వెళ్లాలన్న,గర్భిణులు ఆసుపత్రికి వెళ్లాలన్న, పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్న ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రజలు ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకొని నా వంతు సహాయంగా అంతర్గత రోడ్లు కు మట్టి తో గుంతలను నింపి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో పాలుపంచు కుంటున్నాను అని తెలిపారు. వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అండ దండలతో, జిల్లా నాయకులు లేళ్ల వెంకట రెడ్డి, మండల అధ్యక్షుడు మలోత్ మంగీలాల్ మరియు ప్రజల అండ దండలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.


