ఎన్ డి ఎ కూటమి విజయం
హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్
కాకతీయ, జూలూరుపాడు: బీహార్ ప్రజలు మరోసారి ఎన్ డి ఎ కూటమిని గెలిపించినందుకు జూలూరుపాడు బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు, దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ,ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధాని అని అన్నారు.ప్రధాన మోడీ వెంటే దేశ ప్రజలు ఉన్నారని స్పష్టం అవుతుందని అలాగే రాబోయే 2028 లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కచ్చితంగా గెలిచి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందుకు తగిన విధంగా కార్యాచరణ రచించుకొని బీజేపీ నాయకులందరం కలిసి పనిచేసి తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


