భళారే.. యమ
పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు
కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బిల్డింగ్ బ్లాక్స్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన విచిత్ర వేషధారణ పెద్దలను ఆకట్టుకుంది. అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి కొప్పరి యువన్ యమధర్మరాజు వేషధారణతో ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాధా మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకను పెంపొందించే ఉద్దేశం తో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి ఇందిరా తదితరులు పాల్గొన్నారు.



