కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం
కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు, 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల భర్త మిక్కిలినేని నరేంద్రబాబు మాతృమూర్తి మిక్కిలినేని ప్రమీలారాణి(71) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతిక కాయాన్ని ఖమ్మంలోని వీడిఓస్ కాలనీలో ఉన్న మిక్కిలినేని స్వగృహం వద్ద ఉంచగా ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేంద్రబాబును పరామర్శించి ఓదార్చరు. నివాళులు అర్పించిన వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, ఖమ్మం, పాలేరు డివిజన్ కార్యదర్శిలు వై విక్రమ్, రమేష్, రఘునాథపాలెం మండల కార్యదర్శి నవీన్ రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు షేక్ మీరా, ఎంఏ జబ్బార్, సిపిఐ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధా కిషోర్, పాకాలపాటి శేషగిరి, వడ్డెబోయిన నరసింహారావు, చోటేబాబా, కిలారి బాబ్జి, వివిసి సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు బత్తుల మురళి, టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాసరావు, ఖమ్మం టౌన్ ఏసిపి రమణమూర్తి, సీఐలు భాను ప్రకాష్, కరుణాకర్, బాలకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త ధనాల ప్రసాద్ చౌదరి, కురువెల్ల ప్రవీణ్, గొడవర్తి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు మోపర్తి సుమంత్, కూరపాటి ప్రదీప్ కుమార్, గుమ్మడి రాఘవేంద్ర, తదితరులు నివాళి అర్పించారు.


