ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి
వలస ఆదివాసి గ్రామం పిట్టతోగులో సెంట్రల్ టీం పర్యటన
ఆదివాసీ గ్రామాలను జనగణన చేయాలన్న ఓఆర్జిఐ
అబ్జర్వర్ చంకిత్ కుమార్
కాకతీయ, పినపాక: వలస ఆదివాసి గ్రామాలకు కనీస మౌలిక వసతులు కల్పించడం బాధ్యత అని
ఓఆర్జిఐ అబ్జర్వర్ చంకిత్ కుమార్ అన్నారు. శుక్రవారం పినపాక మండలం వలస ఆదివాసి గ్రామమైన పిట్టతోగు గ్రామాన్ని సెన్సెస్ ఆఫీసర్స్ జాయిన్ డైరెక్టర్ జ్ఞాన శేఖర్ తో కలిసి పరిశీలించారు.ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. సెంట్రల్ టీమ్ ఆధ్వర్యంలో వాగు దాటి రహదారి సౌకర్యం లేకపోవడంతో నడిచి వెళ్లి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. అక్కడ తాగునీరు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. గ్రామానికి విద్యుత్ సౌకర్యం, విద్యా సౌకర్యం లేకపోవడం, పలు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పినపాక తాసిల్దార్ గోపాల కృష్ణ ను కలిసి అక్కడ విషయాలను పరిస్థితులను వివరించారు. పినపాక మండలంలో జరుగుతున్న జనగణన, ఇంటి గణన కార్యక్రమంలో ఆదివాసి గ్రామాలను సైతం జోడించాలని తెలిపారు. రహదారి సౌకర్యం సైతం లేకపోవడంతో వారి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు
డి సుబ్బరాజు , స్టాటిస్టికల్ ఆఫీసర్ సిహెచ్ సతీష్, కుమారి హిమవర్ష, కుమారి హరిత, ఏ వినయ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.



