రిక్కా బజార్ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం..
కాకతీయ,ఖమ్మం : 3ఎచ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ఖలీల్ గత మూడు సంవత్సరములుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సాహిత్య , సాంస్కృతిక , శరీర సౌష్టవ , పోటీలను నిర్వహించారు . అందులో భాగంగా రిక్కా బజార్ హై స్కూల్ నందు పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు విజేతలకు ప్రోత్సాహక బహుమతులు ఎకో క్లబ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ కడవెండి వేణుగోపాల్ సౌజన్యంతో ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగినది . ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణం బాగుంటే సమస్తము బాగుంటుంది . కావున మన జీవిత ప్రయాణంలో పచ్చదనం పరిశుభ్రత కు ప్రాధాన్యతను ఇచ్చి మనం ముందుకు పోవాలని సూచించారు


