ఎలక్ట్రిసిటీ యూనియన్ నేతలకు ఘన సన్మానం
జిల్లా అధ్యక్షుడిగా తంగెడ మహేందర్‌రావు
ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి ఫారుక్
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా తంగెడ మహేందర్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎండి ఫారుక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ 8 సెక్షన్ సిబ్బంది వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.కార్యక్రమంలో ఏఈ ఫసి అహ్మద్, సబ్ ఇంజనీర్ మానస, లైన్మెన్ ఆసిరి ప్రకాశ్, మద్దెల రవీందర్, ఎం.జితేందర్, వి.రాజు, ఏఎల్ఎంలు అనిల్, రమేష్, సిహెచ్.హరికృష్ణ, శ్రీకాంత్, హరికుమార్, ఈఆర్సి చారి, అన్మాన్ కే.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన నేతలు ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.


