పోలంపల్లిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
కేంద్ర మంత్రి బండి సంజయ్ సాయం
కాకతీయ, కరీంనగర్ : పోలంపల్లి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా అందజేస్తున్న సైకిళ్లను బుధవారం పంపిణీ చేశారు. స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు జగదీశ్వర్ చారి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సైకిళ్లతో పాటు పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ చెల్లించడం అభినందనీయం అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర మంత్రి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో మండల విద్యా అధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కరుణాకర్, ఉపాధ్యాయ సిబ్బంది, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు వొద్నాల రవీందర్, పడాల శ్రీనివాస్ గౌడ్, పడాల సారయ్య, రాపర్తి రవీందర్, బుడిగే మహేష్, బుడిగే నరేష్, కాశవేణి రాజు, పచ్చిమట్ల మల్లయ్య, పడాల తిరుపతి, రేగూరి సుగుణాకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రెడ్డి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


