పి డి ఎస్ యు నూతన కమిటీ ఎన్నిక
కాకతీయ, లక్షెట్టిపేట : పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం పి డి ఎస్ యు ఏరియా మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు మంచిర్యాల జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ… పి డి ఎస్ యు అమరవీరుల ఆశయాలను పునికి పుచ్చుకొని శాస్త్ర విద్య సాధనకై, విద్యార్థుల హక్కులకై, విద్యార్థుల సమస్యలపై భూమి బుక్తీ, విముక్తి కోసం న్యాయమైన ప్రజా పోరాటాలు చేస్తూ నూతన ప్రజాస్వామ్య విప్లవం తీసుకురావడంలో విద్యార్థి, యువకులు ఈ సమాజంలో జరుగుతున్న అసమానతలపై నిత్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల అధ్యక్షులుగా ఏ.సంజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మణికంఠ , ప్రధాన కార్యదర్శి బి. శివరాం, సహాయ కార్యదర్శి జె.రోహిత్, కోశాధికారి ఎమ్. సాయి సాగర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, జిల్లా నాయకులు కే. కార్తీక్, వంశీ, అంజి విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



