పత్తి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ,మద్దులపల్లి మార్కెట్ కమిటీల పరిధిలోని సాయి బాలాజీ జిన్నింగ్ మిల్ తల్లంపాడు ,జి ఆర్ ఆర్ జిన్నింగ్ మిల్లులను మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి బుధవారం అడిషనల్ డైరెక్టర్ 2 పురం రవికుమార్ , జాయింట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాసరావు తో కలిసి తనిఖీ చేశారు. పొన్నెకల్లు లోని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్దకు కి పత్తి అమ్ముకోవడం కోసం వచ్చిన రైతులతో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ క్రయవిక్రయాల సమయంలోఎదురవుతున్న సమస్యలు గురించి అడిగితెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల పనితీరు గురించి చర్చించి న ఆమె పలు రికార్డులను పరిశీలించి , కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడాలని జిల్లా మార్కెటింగ్ అధికారి యం ఏ అలీమ్ , సీసీఐ బయ్యర్ వరప్రసాద్ లకు సూచించారు.మార్కెట్ కమిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీచేశారు.



