గోదావరిఖని హాస్పిటల్‌లో సదరం యూ.డి.ఐ.డి క్యాంపులు
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ప్రతినెల సదరం/యూ.డి.ఐ.డి క్యాంపులు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. నవంబర్ 12, 17, 24, 28, 29 తేదీల్లో వర్గాలవారీగా దివ్యాంగులకు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యాంపులో పరీక్ష అనంతరం యూ.డి.ఐ.డి కార్డులు పోస్టు ద్వారా పంపబడతాయని తెలిపారు. డబ్బులు అడిగిన మధ్యవర్తులు లేదా సిబ్బంది వివరాలు కలెక్టర్ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు.


