బాధిత కుటుంబానికి ‘టీజీవో’ పరామర్శ
కాకతీయ ,ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ టీజీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ జిల్లా కోశాధికారి కస్తాల వెంకటేశ్వరరావు తల్లి కస్తాల రామ తులసమ్మ దశదినకర్మ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు వాళ్ళ స్వగ్రామం కొండకోడిమ వైరా మండలం లోతెలంగాణ గెజిట్ అధికార సంఘ నాయకులు ఘననివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి , అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్ , హౌసింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ , జిల్లా సంక్షేమ అధికారిని గుడికందుల జ్యోతి, రిటైర్డ్ ఎంపీడిఓ వెంకటపతి రాజు, హెచ్ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు రుక్మారావు , టీజీవో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంతోటి తిరుపతిరావు, మోదుగు వెంకటేశ్వర్లు, గురుకుల రెసిడెన్షియల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఊటుకూరి దామోదర్ , టీఎన్జీవో రఘునాథపాలెం యూనిట్ అధ్యక్షులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.


