ప్రతిమ పూనుదాం మత్తు వీడుదాం
డ్రగ్స్ పై యుద్ధం చేద్దాం
చైతన్యంపై పోలీసుల కళాజాత
కాకతీయ కొత్తగూడెం రూరల్ : సమాజంలో ప్రజలకు ప్రాణాంతకంగా మారిన డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని ప్రజల్లో స్వచ్ఛందంగా చైతన్యం ఏర్పడినప్పుడే అది సాధ్యపడుతుందని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చైతన్యంపై పోలీసుల కళాజాత స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న డిఎస్పి రెహమాన్ మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు నిత్యం అనేక అవగాహన సదస్సు ఏర్పడి చేసి యువతను మేల్కొల్పి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై చైతన్య యుద్ధం జిల్లాలో ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. చెడు వ్యసనాలకు లోను కాకుండా యువత సన్మార్గంలో నడిచినప్పుడు భవిష్యత్ తరాలకు వారు ఎంతో ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు కరుణాకర్, శివప్రసాద్, వెంకటేశ్వర్లు, ప్రతాప్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



