పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం
సన్నబియమైన అమ్ముడే
కొందరు డీలర్ల నుంచే నేరుగా వ్యాపారు లకు
కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయం
ఒక్కోషాపు నుంచి ప్రతినెలా 20 సంచుల వరకు..?
అధికారుల తనిఖీలు శూన్యం
కాకతీయ, పినపాక: పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సైతం కొందరు అక్రమార్కలు బొక్కేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లో ఏకంగా బియ్యం సంచులే మాయమవుతున్నాయి. నేరుగా వ్యాపారులకు బియ్యం చేరుతోందనే ఆరోప బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎప్పీ షాపుల్లో కనిపిస్తున్న బఫర్ స్టాకే నిదర్శనం. కొన్ని దుకాణాల్లో పదుల సంఖ్యలో బియ్యం బస్తాల కొరత కనిపి స్తోంది. సన్నబియ్యం సరఫరా చేస్తే బియ్యం దందా ఆగిపోతుందని అందరూ భావిం చారు. అయితే గతంలో కంటే ఎక్కువగానే రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగు తుంది. క్వింటాళ్ల కొద్దీ బియ్యం పక్కదారి పడుతున్నా కనీసం అధికారులు అటువైపు
కన్నెత్తి చూడటం లేదన్న ఆరో పణలు వినిపి స్తున్నాయి. పేదల బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాపై కాకతీయఅందిస్తున్న ప్రత్యేక కథనం
బొక్కేస్తున్నారు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపా యలు ఖర్చు చేసి పేదల ఆకలిని తీర్చేందుకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పడుతున్నాయి. రేషన్ బియ్యం సేకరణతో పాటు వ్యాపారా నికి పినపాక, కరకగూడెం మండలాలలో ప్రత్యేక ముఠాలే ఉన్నాయి. చైన్ సిస్టం మాదిరిగా అవతారం
ఎత్తి కొందరు బియ్యం వ్యాపారాన్ని చేస్తు న్నారు. రేషన్ దుకాణాల డీలర్ల తో పాటు వినియోగదారుల నుంచి ప్రత్యేకంగా కొను గోలు చేస్తూ వాటిని నిలువ చేయడానికి ప్రత్యేక గోదాములు, ఇండ్లలో ఉంచుతున్నా రు. ఇక్కడి నుంచి రైస్ మిల్లులకు తరలిస్తూ వాటిని రీసైక్లింగ్ చేసి 25 కిలోల బస్తా చొప్పున మార్చి ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతేగా కుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.దాదాపు సన్న బియ్యాన్ని పేదలు, కొందరు మధ్య తరగతి ప్రజలు కొంతమంది తింటుండగా సంపన్నులు, కొందరు మధ్య తరగతి వారు మాత్రం ఆ బియ్యాన్ని అమ్మకాలు జరుపుతున్నారు.
దీంతో ప్రభుత్వ లక్ష్యం మళ్లీ నీరుగారే పరి స్థితి ఏర్పడుతోంది.
కమిషన్ ఎక్కువ వస్తుండడంతోనే
అన్ని వ్యాపారాల్లో కంటే బియ్యం వ్యాపారం లోనే ఎక్కువ కమిషన్ వస్తుండ డంతో ఈ బిజినెస్ పైనే ఎక్కువమంది దృష్టి సారిస్తున్నారు. సేకరించిన బియ్యం కిలోకు 10 రూపాయల వరకు కమీషన్ వస్తుండ డంతో చాలామంది దీనినే వృత్తిగా మార్చు కొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.కొంత మంది రైస్ మిల్లర్లు కు కొనుగోలు చేసిన రేషన్ బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు అందజేసి వాటిని బియ్యంగా మ లిచి ప్రభుత్వానికి అప్పగించాల్సిన రైస్ మిల్ల ర్లు సదరు వడ్లతో వచ్చిన బియ్యాన్ని అమ్ము కొని రేషన్ దుకాణాల ద్వారా కొనుగోలు చేసిన బియ్యాన్ని రీసైకి లింగ్ చేసి ప్రభుత్వా నికి సీఎంఆర్ అందజేస్తున్నట్లుగా తెలు స్తోంది.
తూతూమంత్రంగా కేసులు…
ఇంతా జరుగుతున్నా, పౌర సరఫరాల శాఖ అధికారులు తూతూ మంత్రంగా 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపు కుంటున్నారు. పీడీ యాక్టు, క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని అధికారులు హె చ్చరిస్తున్నా, అక్రమార్కులు మాత్రం పట్టిం చుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్ర మార్కు లపై కఠిన చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరుతున్నారు.


