epaper
Monday, March 2, 2026
epaper

సీఎం చంద్రబాబు నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం

కాకతీయ,అమరావతి: రాజధానిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో 52వ సీఆర్డీఏ అథార్టీ సమావేశం జరిగింది. ఏడు అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ దోహద పడుతుంది.

అయితే ఎస్పీవీ పరిధిలోకి బయో డిజైన్ ప్రాజెక్టును కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. స్పోర్ట్స్ సిటీ తరహాలోనే హెల్త్ సిటీ కూడా అమరావతిలో ఏర్పాటు కానుందని.. దాని పరిధిలో బయో డిజైన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రజారోగ్య సేవల నిమిత్తం బయో డిజైన్ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉండేందుకు ఏడు దేశాలకు చెందిన నిపుణులు, సంస్థలు సిద్దంగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఎస్పీవీ పరిధిలోని ప్రాజెక్టుల డిజైన్, రెవెన్యూ జనరేషన్ మొదలు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఎస్పీవీనే పూర్తి బాధ్యత వహించనున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు.

గవర్నమెంట్ కాంప్లెక్స్ కు మౌలిక సదుపాయాలపై ఫోకస్

అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన టెండర్ కు సీఆర్డీఏ అథార్టీ ఆమోదించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుసంధానంగా రోడ్లు, ఫుట్ పాత్ ల నిర్మాణానికి సంబంధించిన పనులు ఇకపై మొదలు కానున్నాయి. దీంట్లో భాగంగా 53.68 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణమే కాకుండా… ఏడేళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా టెండర్ దక్కించుకున్న సంస్థే చేపట్టేలా నిబంధనలు పెట్టినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇక రాజధాని ప్రాంతంలో అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి అథార్టీ ఆమోదించింది. డిజైన్లను ఆమోదించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అమరావతి నగరం మొత్తంగా ఆకర్షణీయంగా కన్పించేలా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రతి కట్టడమూ ప్రజలను ఆకర్షించేలా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఆర్డీఏ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులతో కార్యాకలాపాలు పెరిగాయని అధికారులు చెప్పగా… ఈ మేరకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్, ఆన్ డ్యూటీ విధానంలో నియమించుకునేందుకు సీఎం అనుమతిచ్చారు.

కన్వెన్షన్ సెంటర్లకు భూములు

రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం కొన్ని ప్రముఖ హోటళ్లు ముందుకు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రముఖ హోటళ్లకు భూములు కేటాయించామని.. వాటికి అనుబంధంగా కొందరు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారని… అయితే అందుకు భూములు ఇవ్వాలని ప్రతిపాదించాయని చెప్పారు. నిర్మాణాలు ప్రపంచ ప్రమాణాలకు ధీటుగా ఉండాలని సూచిస్తూ… ముందుకొచ్చిన సంస్థలకు కన్వెన్షన్ సెంటర్ల నిమిత్తం భూములు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

మాస్టర్ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా ఏమైనా భూ సేకరణ చేపట్టాలంటే రైతులతో మాట్లాడి ఆ ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రైతులతో మాట్లాడి… వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు ఇచ్చారు. కృష్ణా నదిలోని ద్వీపాలను అభివృద్ధి చేసి టూరిజాన్ని ఆకర్షించేలా చూడాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, మున్సిపల్, సీఆర్డీఏ, ఏడీసీ సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేలిపోయిన‌ బ‌తుకులు

పేలిపోయిన‌ బ‌తుకులు వేట్లపాలెంలో బాణసంచా పేలుడు సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ కేంద్రంలో ఘోర ప్రమాదం 23 మంది...

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు!

వెట్లపాలెం బాణాసంచా కర్మాగ‌రంలో పేలుళ్లు! సజీవదహనమైన 18 మంది కార్మికులు తీవ్రంగా గాయపడిన మరో...

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది

మా ఊరి తంగేడు పూలు ఖ్యాతిని తెచ్చిపెట్టింది ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ తెలుగు...

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం

ల‌డ్డూ క‌ల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం...

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘ‌నంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం ఆరంభం గోవింద...

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని

చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ,...

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌

ఇస్రో ప్ర‌యోగం స‌క్సెస్‌ కక్ష్యలోకి అమెరికా బ్లూబర్డ్ బ్లాక్–2 భారీ ఉప‌గ్ర‌హం ఎల్‌వీఎం3–ఎం6 ద్వారా...

టీటీడీలో మరో కుంభకోణమా?

టీటీడీలో మరో కుంభకోణమా? గోవిందరాజస్వామి గోపురం బంగారు తాపడంపై అనుమానాలు విమాన గోపురం బంగారు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img