బాధితునికి సెల్ ఫోన్ అప్పగించిన 1 టౌన్ సీఐ
కాకతీయ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరం పాకబండ బజార్ సెల్ ఫోన్ పోయిందని ఒడిశా రాష్ట్రానికి చెందిన శివ అనే పాణిపూరి యజమాని కొన్ని రోజుల క్రితం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. పిర్యాదు అందుకున్న 1టౌన్ సీఐ కరుణాకర్ తన సిబ్బంది కి అప్పగించారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా కనిపెట్టి బాధితునికి గురువారం అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ వివరాలు ఇప్పటివరకు తమ స్టేషన్ పరిధిలో సుమారు 500 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. సెల్ ఫోన్ దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెల్ ఫోన్ కొనేటప్పుడు షోరూమ్ వారు ఇచ్చే బిల్,ఐ ఎమ్ ఏ నెంబర్ లు తప్పనిసరిగా తమవద్ద ఉంచుకోవాలని దానివల్ల రికవరీ చేయడం సులభతరం అవుతుందన్నారు. బాధితునికి ఫోన్ అప్పగించిన కార్యక్రమంలో ఉమెన్ కానిస్టేబుల్ రజియ పాల్గొన్నారు.


