ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
ధన్‌ఖడ్ మంచి ఆరోగ్యంతో ఉండాలన్న ప్రధాన మోదీ

కాకతీయ, న్యూఢిల్లీ : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ముర్ము ఫైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఆ రాజీనామాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి పంపారు.అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్ ఖడ్ రాజీనామా చేయగా .. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.


