విజయవాడలో భారీ వర్షాలు
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత
కాకతీయ, విజయవాడ(జూలై 25) : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున భద్రతా పరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల వాహనాలను కనకదుర్గ నగర్ వైపు మళ్లిస్తున్నారు. ఈ మేరకు భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు


