ఆగష్టు 15 నుంచి ఏపి లో ఉచిత బస్సు సౌకర్యం

కాకతీయ, అమరావతి : ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం అని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఎపి మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెడనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను మంత్రి వివరించారు. పెడనలో డ్రైనేజీల నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పూర్తికి రేపు నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. పెడనలో వచ్చే రెండేళ్లలో తాగునీరు అందించేలా పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


