ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు స్వాగతం
కాకతీయ, న్యూఢిల్లీ (జూలై 25) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేవీ పర్యటన లో భాగంగా ప్రధాని శుక్రవారం మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. రెండు రోజులపాటూ (25-26) మాల్దీవ్స్‌లో మోదీ పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం మాలే చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాలే ఎయిర్‌పోర్ట్‌లో వందేమాతరం, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు వినిపించాయి. అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇది మూడోసారి. మొయిజు మాల్దీవులలో అధికారం చేపట్టిన తర్వాత ఒక విదేశీ దేశాధినేత తొలి పర్యటన ఇదే కావడం విశేషం.


