కాకతీయ, గీసుగొండ: రాత్రి కురిసిన భారీ వర్షంతో వరంగల్ నగర పాలక సంస్థ 16వ డివిజన్లో గల కట్టమల్లన్న చెరువు మత్తడి పడింది. దీంతో గరీబ్నగర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. రోడ్లు పూర్తిగా వరదమయం అవ్వడంతో పలువురి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి, ఫర్నిచర్ సహా గృహోపకరణాలు తడిసి ముద్దయ్యాయి.
ఆకస్మికంగా ముంపు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోని వస్తువులు నీటిలో మునిగిపోయాయి, చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు


