కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ పోటి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకత్వానికి టికెట్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. నెల్లికుదురు జడ్పిటిసి, బిసి జనరల్ కావడంతో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలతో జిల్లా, స్థానిక నాయకుల ఆశీస్సులు ఉన్నాయని, తన సన్నిహితుల ద్వారా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మండలంలో గౌడ్ సామాజిక వర్గం 40 శాతం ఓట్లు కలిసొచ్చే అవకాలున్నాయి. దీనితో తన అభ్యర్థిత్వానికి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాడాన అనుభవం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రశ్నించినందుకు అనేక కేసులను ఎదుర్కొన్నట్లు నాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కో-ఆర్డినేటర్ గా పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, పార్టీ అప్పగించిన భువనగిరి పార్లమెంట్ గెలుపులో, ప్రజా సమస్యల ధర్నాలలో ముందుండి పాల్గొన్నానని తనకు టికెట్ కేటాయించాలని అగ్ర నాయకత్వానికి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.


