కాకతీయ, నేషనల్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైందే అన్నారు. మాస్కో కీవ్ మధ్య సంధీ కుదుర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా జెలెన్ స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జెలెన్ స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్స్ విధించడం సరైన చర్య అన్నారు. ఇటీవలషాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ తియాంజెన్ లో చైనా అధినేత జెన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి వేదిక పంచుకోవడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ ప్రకటన వెలువడటం గమనార్హం. నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ట్ మాస్కోపై మరిన్ని ఆంక్షలు విధిస్తారని వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యే విధంగా చూసే బాధ్యత తమదే అన్నారు.
ఉదాహరణకు భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించేందుకు తాము సిద్ధంగాఉన్నాము. ఆంక్షల స్థాయి వాటిని విధించిన సమయంపై ప్రస్తుతం భవిష్యత్తులో కూడా మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్ స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్ తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఉక్రెయిన్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో పరిణామాలపై జెలెన్ స్కీతో మాట్లాడి ఆయన అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలిపాను. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు ఉక్రెయిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తామిద్దరం కీలక అంశాలపై వివరంగా చర్చించినట్లు జెలెన్ స్కీ కూడా పేర్కొన్నారు. అయినా ఆయన నుంచి భారత్ పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.


