కాకతీయ,లక్సెట్టిపేట : మండలంలోని దౌడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి దండేపల్లి మండలం కోర్విచెల్మా గ్రామానికి చెందిన సౌటేపల్లి మౌళి (32) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మౌళిరోజు మాదిరిగా ఉదయం 4గంటలకు తన భార్య కు వాకింగ్ కోసమని చెప్పి వెళ్ళాడు. 8గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని జాడకోసం వెతకగా డౌడేపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి దగ్గర బైక్, అతని చెప్పులు, సెల్ ఫోన్ కనిపించాయి. దీంతో బావిలో వెతకగా మౌళి మృతదేహం లభ్యమయింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అతని తండ్రి లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు. మృతుడికి భార్య సంజన, 10 నెలల వయస్సున్న జయరాం అనే కొడుకు ఉన్నాడు.


