మతోన్మాదానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి
భగత్ సింగ్ స్ఫూర్తితో ఐక్య పోరాటం
పీవైఎల్, పిడిఎస్యూ, టియుసిఐ, పీఓడబ్ల్యూ నాయకుల పిలుపు
ఫోటో ఎగ్జిబిషన్‌తో వర్ధంతి సభలు
కాకతీయ, ఖమ్మం : మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ట్యాంకుబండ్‌పై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి, కార్మిక, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సామాజిక ఐక్యతే లక్ష్యం
దేశమంతా ఒకటే అన్న భావనతో స్వాతంత్ర్యానికి ప్రాణత్యాగం చేసిన వీరుల ఆశయాలను గుర్తుచేశారు. నేటి పరిస్థితుల్లో కులం, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా పోరాటం అవసరమని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాటం అవసరం
నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించకుండా పాలకులు ప్రజలను మత, కులాల పేరుతో మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో యువత ముందుకు వచ్చి ప్రజా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మంగతాయి, పీవైఎల్ జిల్లా కార్యదర్శి భరత్, పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు టి. లక్ష్మణ్, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీను, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి, టియుసిఐ జిల్లా కార్యదర్శి జి. రామయ్య, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు టి. ఝూన్సి, సహాయ కార్యదర్శి పి. శోభ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ధరణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


