కాకతీయ, పెద్దపల్లి : మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పిస్తూ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఎంబీ గార్డెన్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడారు. మత్తుకు ఎవరూ బానిస కాకూడదని, యువత దేశానికి మార్గదర్శకంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ నినాదంతో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అలాగే మత్తు అనే పదం అంటేనే భయ పడే విధంగా పోలీసు యంత్రాంగం మత్తుపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువత తల్లిదండ్రులకు గౌరవం కలిగించేలా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు బొంకూరి అవినాష్, ముత్యాల నరేష్, జిల్లా పోలీసులు, వైద్య నిపుణులు వరష్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.


