విద్యుదాఘాతంతో యువకుడు మృతి
కాకతీయ, రాయపర్తి : విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తొగరి శివకుమార్ ఇంట్లో శుక్రవారం బోరు వేశారు. బోరు వేయడం పూర్తి అయ్యాక రామ్ సింగ్ (22)అనే యువకుడు బోరు పైపులు సరిచేస్తుండగా పక్కనే ఉన్న 11కేవి విద్యుత్ తీగలకు పైపు తగిలింది.ఈ నేపథ్యంలో రామ్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని 108 అంబులెన్స్ లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.


