కాకతీయ, మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచెర్లలో
గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఆ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఇందారపు రాకేష్, ఉపాధ్యక్షుడిగా రావుల రాకేష్, ప్రధాన కార్యదర్శిగా బొంతల అశోక్, కార్యదర్శిగా తాండ్ర వంశీ, కోశాధికారిగా బొబ్బిలి రాము, అధికార ప్రతినిధిగా ఇందారపు రంజిత్, ప్రచార కమిటీ కన్వినర్ గా గుగ్గిళ్ళ రాజ్ కుమార్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి , డివిజన్ అధ్యక్షుడు చీమల సందీప్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షుడు కేసరపు చంద్రయ్య , పాక్స్ వైస్ చైర్మన్ మల్క ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, అశోక్ రావు , జిల్లా జనరల్ సెక్రటరీ మండల రాహుల్, శివ, మాజీ ఉప సర్పంచ్ ఇందారపు చంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, బొబ్బిలి రాజు, ఉదయ్ , రావుల ఆంజనేయులు తది తరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


