కాకతీయ, నాగర్‌కర్నూల్ : తల్లి ఫోన్ కొనివ్వలేదని చరణ్(18) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. గత కొద్దిరోజులుగా కొత్త ఫోన్ కొనివ్వాలని చరణ్ తల్లిని పదేపదే అడుతున్నాడు. అయితే ఇప్పుడు డబ్బుల్లేవని జీతం వచ్చాక కొనిస్తానని తల్లి చెప్పడంతో, మనస్తాపానికి గురైన చరణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


