- యువజన క్రీడల శాఖ జిల్లా శాఖ అధికారి ఓలేటి జ్యోతి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జాతీయ యువజనోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా స్థాయి యువకళాకారుల ఎంపికలను ఈనెల 12న చేపట్టనున్నట్లు యువజన క్రీడల శాఖ జిల్లా శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మహబూబాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించబడునని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థుల వయసు 15 నుంచిల 29 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారు రానున్న రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీకి పంపించనున్నట్లు ఆమె వివరించారు. పూర్తి సమాచారం కోసం మహబూబాబాద్ జిల్లా యువజన ,క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.


