యువకుడి ప్రాణాలు బలిగొన్న లూడో గేమ్!
కాకతీయ, మహబూబ్‌నగర్ : ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడి రూ.5 లక్షలు పోగొట్టుకున్న యువకుడు గడ్డమీది వెంకటేశ్(23) అనే యువకుడు బుధవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జాక్లెర్ గ్రామంలో జరిగింది.

గ్రామానికి చెందిన వెంకటేష్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి, రోస్ట్ కేఫ్‌లో తోటమాలిగా పని చేస్తుండగా.. ఈక్రమంలో ఆన్‌లైన్‌లోని లూడోగేమ్‌కు వ్యసనపరుడిగా మారాడు. ఈక్రమంలోనే బెట్టింగ్ యాప్‌లతో అప్పుల పాలయ్యాడు. తీవ్ర మనస్తాపం చెందిన వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


