23 ఏళ్లకే సర్పంచ్‌గా యువతి విజయం
దుబ్యాల పంచాయతీలో సంగి అంజలి సంచలన గెలుపు
కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువతికి అరుదైన అవకాశం దక్కింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యువ అభ్యర్థి సంగి అంజలి (23) సర్పంచ్‌గా విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 41 ఓట్ల తేడాతో గెలుపొందారు. తక్కువ వయస్సులోనే ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. యువతకు నాయకత్వ అవకాశాలు ఇస్తే గ్రామాభివృద్ధిలో కొత్త దిశ కనిపిస్తుందన్న అభిప్రాయం గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. అంజలి విజయం దుబ్యాల గ్రామ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. యువత పాత్రను గ్రామ పాలనలో మరింత బలపర్చేలా ఈ ఫలితం నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు.


