యువతి అదృశ్యం మిస్సింగ్, కేసు నమోదు
కాకతీయ, పెద్దవంగర : యువతి అదృశ్యమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పెద్దవంగర ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పాక స్వాతి (20) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది. ఈ నెల 16 అదివారం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కూతురు ఇంట్లో లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో స్వాతి తండ్రి పాక యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


