అర్కేపీలో ఏరులై పారుతున్న గుడుంబా
నిండు జీవితాలు చిత్తు
కాకతీయ, రామకృష్ణాపూర్ : ధర తక్కువ కిక్కు ఎక్కువతో విలువైన నిండు జీవితాలను గుడుంబా (సారా) ప్యాకెట్లతో యువత నాశనం చేసుకుంటున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. కొందరు ధనార్జనే ధ్యేయంగా తెల్లవారు నాలుగు,ఐదు గంటల నుంచే వ్యాపారాలు సాగిస్తూ గుడుంబా ప్యాకెట్లను అమ్మకాలు చేపడుతున్నారు. సారా ప్యాకెట్లకు అలవాటైన కొందరు కుటుంబాలను లెక్క చేయకుండా జీవితాలను పాడు చేసుకుంటున్నారు.కాగా శనివారం గుడుంబాకు అలవాటైన ఓ బాధితుని కుటుంబ సభ్యులు అమ్మకాలు చేపడుతున్న ప్రాంతానికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇంత వ్యాపారం జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఆ విడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుడుంబా దందాపై ఎక్సైజ్,పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించి చీకటి వ్యాపారాలకు పులీస్టాప్ పెట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.అవసరమైతే గుడుంబా రహిత ప్రాంతంగా ఆర్కేపీనీ మార్చాలంటున్నారు


