టోల్ వసూళ్లపై యువకుడి వినూత్న నిరసన ట్రాఫిక్కు అంతరాయం
కాకతీయ, కరీంనగర్ : రాజీవ్ రహదారిపై రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఒక యువకుడు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు, కారు కొనుగోలు సమయంలోనే జీవితకాల రోడ్డు పన్ను చెల్లిస్తున్నప్పటికీ, మళ్లీ టోల్ రూపంలో వసూళ్లు చేయడం అన్యాయమని ఆరోపించాడు.
ఒకే వాహనానికి రెండుసార్లు పన్ను విధించడం దారి దోపిడీతో సమానమని పేర్కొంటూ, టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాడు. దీంతో వాహనాలు నిలిచిపోవడంతో రహదారిపై రద్దీ నెలకొంది.


