కాకతీయ, ఇనుగుర్తి: మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల రాజు(27) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జి. కరుణాకర్ తెలిపారు. ఆయన కథనం ఎనిమిదేళ్ల క్రితం వరంగల్లో పాలిటెక్నిక్ చదివే క్రమంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వారిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. గతేడాది ఆ యువతి ఇంట్లో వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతి తనతో మాట్లాడవద్దని, కలవవద్దని చెప్పింది. అప్పటినుంచి రాజు మానసికంగా ఇబ్బందికి గురయ్యాడు. మనస్థాపంతో ఈనెల 15న గడ్డి మందు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తొర్రూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి కొమురుమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.


