వామ్మో బంగారం ధర ఇంత పెరిగిందేంటీ..?!
ఒక్కరోజులోనే అంతనా… తెలిస్తే షాకవుతారు..!!
కాకతీయ, బిజినెస్ డెస్క్ : బంగారం ధర మళ్లీ పైకి ఎగబాకుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో దేశ వ్యాప్తంగా మందగమనం.. పురోగతి లేకుండా ఉండటంతో.. మదుపర్లు బంగారంపై పెట్టుబడికి.. కొనుగోళ్లు చేపడుతూ స్థిరాస్తిగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. సెప్టెంబర్ 4న ఉదయం 7.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 06, 980కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 98, 060కి చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 07, 130కి ఉండగా , 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 98, 210కి చేరుకుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 06, 980కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 98, 060కి చేరుకుంది.


