epaper
Monday, March 2, 2026
epaper

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు

అన్నంలో పురుగులు.. ఇనుప తీగలు
కేయూ మెస్‌లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ నిర్ల‌క్ష్యం
విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటం
హాస్టల్ మెస్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు
వీసీ చాంబర్‌ను ముట్టడించిన విద్యార్థినులు

కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్ మెస్‌లో తీవ్ర భోజన భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులకు వడ్డించిన భోజనంలో పురుగులు, ఇనుప తీగలు బయటపడటంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. విద్యార్థినుల ఆరోగ్యంతో యాజమాన్యం చెలగాటమాడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నం, కూరలో పొడవాటి పురుగులు, నలుపు రంగు ఇనుప తీగలు స్పష్టంగా కనిపించాయని విద్యార్థినులు తెలిపారు. తినే సమయంలోనే ఈ వస్తువులు గుర్తించడంతో పలువురు భోజనం వదిలేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది.

ఎప్పటి నుంచో నాసిరకం భోజనం

ఇది మొదటిసారి కాదని, గత కొంతకాలంగా గర్ల్స్ హాస్టల్ మెస్‌లో నాణ్యతలేని ఆహారం, పాత కూరగాయలు, సరైన వంట విధానం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మెస్ సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. వంటశాల, పాత్రలు, నిల్వ గదుల్లో పరిశుభ్రత లోపించిందని, ఆహార భద్రతపై నిరంతర తనిఖీలు జరగడం లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని అభిప్రాయపడ్డారు. ఇక హాస్టల్ పరిసరాల్లో వీధి కుక్కలు నిర్బంధం లేకుండా తిరగడం, మెస్ ప్రాంతంలోకి కూడా చేరడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు తెలిపారు. ఆహార ప్రాంతాల్లో జంతువుల సంచారం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు పెద్ద ఎత్తున వీసీ చాంబర్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. గర్ల్స్ హాస్టల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. యాజమాన్యం స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో పరిష్కారం హామీ

విద్యార్థినుల నిరసన తీవ్రత పెరగడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. వీసీ ఆదేశాల మేరకు విద్యార్థినులతో సమావేశం ఏర్పాటు చేసి, వారం రోజుల్లో గర్ల్స్ హాస్టల్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెస్ నిర్వహణపై సమీక్ష, పరిశుభ్రత మెరుగుదల, భోజన నాణ్యత పెంపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేయలేదని, ఈసారి కూడా మాటలకే పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. గర్ల్స్ హాస్టల్‌లో కనీస సదుపాయాలు, నాణ్యమైన భోజనం, భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img