కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం ఎంపీయూపీఎస్ లో ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు ఎర్ర పూర్ణచందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ ఎం పూర్ణచందర్ ఆర్థిక సహకారంతో టై, బెల్టులు, ఐడి కార్డ్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం అందరికీ గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శేఖర్, మురళి, వెంకన్న, తిరుపతయ్య, సీఆర్పీ రవి పాల్గొన్నారు.


