ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామాల్లో పతాకవిష్కరణలు, బైక్ ర్యాలీ
చెరువులను రక్షించాలని తహసీల్దార్ కు వినతి
కాకతీయ, దుగ్గొండి: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు, పొన్నం మొగిలి ముదిరాజు ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో శుక్రవారం మత్స్య సహకార సొసైటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ గిర్నిబావి నుండి దుగ్గొండి వరకు నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుండి మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థులు మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో బజెండా ఆవిష్కరణలు జరిగాయి. దుగ్గొండి మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ జండాని ఎగరవేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 26 లక్షల మంది ఉన్న ముదిరాజ్ సమాజం జనాభా బలానికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ-డీ ఉపవర్గంలో ఉన్న ముదిరాజ్‌ను బీసీ-ఏ జాబితాలో చేర్చి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని, రుణమాఫీ, చేపల విత్తనాల సకాల సరఫరా, రిజర్వాయర్లలో స్థానిక సొసైటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి ఆర్థిక హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో ముదిరాజ్ లకు అధికంగా అవకాశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో “మనమెంతో.. మనకు అంతా” అనే నినాదాన్ని నిజం చేయడానికి నిరంతర పోరాటం సిద్ధంగా ఉండాలని జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి ముదిరాజ్, ఎన్ఆర్ఐ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ రాజేశ్వర్ రావు కు నిరుద్యోగులైన ముదిరాజ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, అక్రమణకు గురవుతున్న చెరువులను కాపాడాలనే డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు నీరటి సదానందం ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె రమేష్, మండల అధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా నాయకులు గిన్నె భాస్కర్, నేదురు రాజేందర్, బండారి ప్రకాష్, వరంగంటి తిరుపతి, దండు చిరంజీవి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు ఈర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.



