కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో “వరల్డ్ ఎక్స్పో-2025” ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక అవగాహన అవసరమని, అది పోటీ పరీక్షల్లో విజయానికి పునాది అవుతుందని అన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని దేశాల విద్యా విధానాలు, పరిశ్రమలు, సంస్కృతి, క్రీడలు తదితర అంశాలను విద్యార్థులు ఆకర్షణీయంగా ప్రదర్శించారు. “మన ప్రపంచం – మన అద్భుతం – మన జీవితం” నాటిక ప్రేక్షకులను అలరించింది. ప్రాంగణాన్ని భారతదేశం, అమెరికా, రష్యా, జపాన్, చైనా, పారిస్, దుబాయ్, లండన్ తదితర దేశాల ప్రతీకలతో అందంగా అలంకరించారు.
అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్‌లో ఘనంగా వరల్డ్ ఎక్స్పో-2025
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


