పరిష్కారమే లక్ష్యంగా పని చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వివిధ విభాగాలకు చెందిన 114 ఫిర్యాదుల స్వీకరణ
ప్రజల నుండి వినతులు స్వీకరించిన కమిషనర్
కాకతీయ, వరంగల్ : ప్రజలు చెప్పుకుంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఇచ్చారు. ఫిర్యాదులు వివరాలు ఇలా..
టౌన్ ప్లానింగ్ విభాగానికి 54, ఇంజనీరింగ్ విభాగానికి 32, రెవిన్యూకు 08, హెల్త్ అండ్ శానిటేషన్ కు 12, నీటి సరఫరాకు 07, విపత్తు నిర్వహణ 01చొప్పున మొత్తం 114 వినతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, డిఎఫ్ఓ శంకర్ లింగం, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, సమ్మయ్య, టిఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


