వండర్ హాట్ ధర!
మిర్చికి రికార్డు ధర రూ.37,100
మార్కెట్లో ఈ సీజన్లో ఇదే అధికం
కాకతీయ, వరంగల్:వండర్ హాట్ మిర్చి.. ధర బాగా పలుకుతోంది. బుధవారం ఈ రకం మిర్చి క్వింటా రేటు రూ.37,100 పలికింది. జనవరిలో ప్రారంభమైన ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇదే హైలెట్ ధరగా మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పేర్కొన్నారు. ఇక ఇతర రకం ధరలు పరిశీలిస్తే.. తేజ మిర్చి గరిష్టంగా రూ. 19,600, కనిష్టంగా రూ.12వేలుగా ఉంది. అలాగే వండర్ హాట్ కనిష్ట ధర రూ.15వేలకు విక్రయాలు సాగాయి. యుఎస్ -341 రకం మిర్చి గరిష్టంగా 26,200 ఉండగా, కనిష్ట ధర రూ.12,500తో కొనుగోళ్లు జరిగాయి. దీపిక రకం గరిష్ట, కనిష్ట ధరలు రూ.30వేలు పలకడం గమనార్హం. ఇప్పటివరకు ఈ సీజన్ లో 1,10,985 బస్తాల సరుకు వచ్చినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో కొత్త సరుకు 58,265 బస్తాలు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకు 52,720 బస్తాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.


